శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (13:06 IST)

భార్య నల్లగా వుందని.. కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు

crime scene
భార్య నల్లగా వుందని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. నల్లగా వుందని భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు చంపారన్ జిల్లా సంగ్రామ్పూర్ పురందర్పూర్ గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ షా, ప్రియాంక దేవి భార్యభర్తలు. ప్రియాంక నల్లగా వుండటంతో శ్యామ్‌కు నచ్చేది కాదు. దీంతో అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఆమెను వేధించేవాడు. 
 
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. సోమవారం కూడా ఇద్దరి గొడవ జరగ్గా.. శ్యామ్ లాల్ సహనం కోల్పోయాడు. అంతేగాకుండా ఆవేశంలో భార్యకు కరెంట్ షాక్ ఇవ్వడడంతో ఆమె స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది.