శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (11:38 IST)

కలెక్టరేట్‌లోనే మహిళపై కలెక్టర్ అత్యాచారం!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఓ జిల్లా కలెక్టరే అత్యాచారానికి పాల్పడ్డాడు. అదికూడా కలెక్టర్ కార్యాలయంలోనే ఈ లైంగిక దాడి జరిగింది. కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తిని డిస్మిస్ చేస్తానని బెదిరించి, ఆ వ్యక్తి భార్యపై కలెక్టర్ ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జంగజీర్ చాంఫ్ జిల్లా కలెక్టరుగా పనిచేసిన జనక్ ప్రసాద్ పాథక్ మే 15వ తేదీన కలెక్టరు కార్యాలయంలోనే తనపై అత్యాచారం చేశారని 33 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించి తనను కలెక్టరేట్‌కు పిలిపించి తనపై కలెక్టరు అత్యాచారం చేశాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తాము కలెక్టరుపై ఐపీసీ 376, 506, 509బి కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు జంగజీర్ చాంపా జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్ చెప్పారు.
 
కాగా, మహిళపై అత్యాచారం చేసిన కలెక్టరుపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి, రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టరుగా సర్కారు బదిలీ చేసింది.