శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (06:50 IST)

నీటి కోసం వలస వెళ్లడం ఖాయం : పర్యావరణవేత్త రాజేంద్రసింగ్

దేశంలో ఒకవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి. ఉత్తరభారత దేశం మొత్తం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోతోంది. మరోవైపు, దక్షిణభారతదేశంలోని పలు రాష్ట్రాలు చుక్క నీటిబొట్టు కోసం అల్లాడుతున్నారు. దాహం తీర్చుకునేందుకు కూడా నీరు లేదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి గల కారణాలపై ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్ర సింగ్ స్పందించారు. 
 
ఇప్పటివరు గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలస రావడమే మనం చూశాం.. చూస్తున్నాం. కానీ, రాబోయే రోజుల్లో మనవాళ్లు నీటి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని కూడా మనం చూడబోతున్నాం. ప్రస్తుతం ఉన్న మన దేశం ఎదుర్కొంటున్న వాతావరణ పరిస్థితులు, అధిక నీటి వాడకమే దానికి కారణం. ఇలాంటి పరిస్థితులను నీటి నిర్వహణ పద్ధతులను అందరం అనుసరిస్తేనే సమర్థవంతంగా ఎదుర్కోగలం అని ఆయన చెప్పుకొచ్చారు.