బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ప్రేమకు - విద్వేషానికి మధ్య జరిగే పోరాటం : రాహుల్ గాంధీ

rahul gandhi
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలం నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, గాంధీకి, గాడ్సేకు, ప్రేమకు, విద్వేషానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. 
 
దేశ రాజకీయాల్లో గాంధీజీ ఒకవైపు, ఆయన హంతకుడు గాడ్సే మరో వైపు ఉండి పోరాడుతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతున్న రాజకీయ పోరును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఈ క్రమంతో ఈ గాడ్సేతో బీజేపీని పోల్చుతూ పలు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలోని కలాపీపాయి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో శనివారం రాహుల్ పాల్గొన్నారు. 
 
2024 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామన్నారు. 'ఇప్పుడు దేశంలో సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోంది. ఈ పోరాటంలో కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరోవైపు నిలిచాయి. ఒకవైపు ప్రేమ, సోదరభావం మరోవైపు ద్వేషం ఉన్నాయి. ఒకవైపు గాంధీజీ ఉంటే మరోవైపు గాడ్సే నిలబడ్డాడు' అని రాహల్ అన్నారు. 
 
బీజేపీ తాను వెళ్లిన దగ్గరల్లా ద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని, అందువల్లే మధ్యప్రదేశ్‌లో రైతులు, విద్యార్థులు ఆ పార్టీని ఇప్పుడు విపరీతంగా ద్వేషించే పరిస్థితికి చేరుకున్నారు. జోజో యాత్రలో మధ్యప్రదేశ్‌లో 370 కిలోమీటర్లు నడిచానని, దేశంలో ఎక్కడా లేనంత అవినీతి మధ్యప్రదేశ్‌లో ఉన్నదని ఇక్కడి రైతులు, మహిళలు తనకు ఫిర్యాదు చేశారని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యానికి రూ.2,500 మద్దతు ధరను అక్కడి రైతులు పొందుతున్నారని, మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే ఆ విధానాన్నే అమలు చేస్తామన్నారు.