బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (11:46 IST)

భారత్‌ ప్రధానితో జపాన్ ప్రధాని భేటీ.. కీలక అంశాలపై చర్చ

PM Kishida
భారత్‌లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో జపాన్ భారత పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా సమావేశం అవుతారు. 
 
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీంతోపాటు ఉక్రెయిన్‌లో పరిస్థితిపై ఇరువురు కీలక నేతలు చర్చిస్తారు. ఈ భేటీలో భాగంగా... ఇండో-పసిఫిక్‌లో రక్షణ, పరస్పర సహకారంపై చర్చించనున్నారు. 
 
ఇరు దేశాలద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడంతోపాటు పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. ఈ భేటీ సందర్భంగా భారత్‌లో జపాన్ పెట్టుబడుల అంశంపై కూడా చర్చించనున్నారు.
 
కాగా.. ఇరువురు నేతల మధ్య ఇదే తొలి భేటీ కావడం విశేషం. అంతకుముందు భారత్ – జపాన్ శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 2018లో టోక్యోలో జరిగింది.