శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (17:05 IST)

రజనీ నా ప్రాణస్నేహితుడు... అందుకే కలిశా : కమల్ హాసన్

ఈనెల 21న తేదీ నుంచి రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టనున్న సినీ నటుడు కమల్ హాసన్ ఆదివారం తన ప్రాణస్నేహితుడు రజనీకాంత్‌ను కలిశారు. చెన్నైలోని రజనీ నివాసానికి కమల్ వెళ్లారు.

ఈనెల 21న తేదీ నుంచి రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టనున్న సినీ నటుడు కమల్ హాసన్ ఆదివారం తన ప్రాణస్నేహితుడు రజనీకాంత్‌ను కలిశారు. చెన్నైలోని రజనీ నివాసానికి కమల్ వెళ్లారు. ఈ సమావేశం అనంతరం కమల్ మీడియాతో మాట్లాడుతూ, రజనీకాంత్‌ని కలిసింది రాజకీయాల నేపథ్యంలో కాదని, తమిళనాడులో తన రాజకీయ పర్యటన ప్రారంభించనున్న విషయాన్ని ఆయనకు చెప్పేందుకు వచ్చినట్టు చెప్పారు.
 
రాష్ట్రంలో తనకున్న ఆప్తుల్లో రజనీ ఒకరన్నారు. ఈనెల 21వ తేదీన తాను చేపట్టనున్న రాజకీయ యాత్ర విషయాన్ని ప్రాణ స్నేహితుడైన రజనీకి చెప్పేందుకే వచ్చినట్టు కమల్ తెలిపారు. 
 
ముఖ్యంగా, తన పర్యటనకు ముందు అందరినీ ఓసారి కలవాలని అనుకున్నానని, ఈ నేపథ్యంలోనే రజనీని కలిసినట్టు చెప్పారు. ఈ నెల 21న తన రాజకీయపార్టీని ప్రకటిస్తున్నానని, స్నేహితులు, శ్రేయోభిలాషులను కలుస్తున్నానని, ఇందులో ఎలాంటి రాజకీయకోణం లేదని స్పష్టంచేశారు. 
 
ఇకపోతే, తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదన్నారు. అయితే, తనతో రజనీకాంత్ పొత్తు పెట్టుకుంటారా లేదా అన్నది ఆయన్నే అడగాలన్నారు. అసలు తమ మధ్య ఎలాంటి రాజకీయాలు, పొత్తుల అంశం చర్చకు రాలేదన్నారు.