సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (12:59 IST)

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధుకు గవర్నర్ నోటీసులు - మంత్రివర్గం కీలక నిర్ణయం!!

Siddaramaiah
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ నోటీసులు జారీచేశారు. దీన్ని కర్నాటక మంత్రివర్గం తీవ్రంగా తప్పుబట్టింది. గవర్నర్ పంపిన నోటీసులను తక్షణం వెనక్కి తీసుకోవాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) సంస్థ ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహరాలంలో సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడం ఆ రాష్ట్ర రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనంగా మారిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య లేకుండానే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధ్యక్షతన ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విధాన సభలో జరిగింది. ఇందులో సీఎంకు గవర్నర్ నోటీలు జారీచేయడాన్ని తప్పుబడుతూ తక్షణం ఆ నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.