శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మే 2021 (18:01 IST)

కరోనా ఇన్ఫెక్షన్‌.. మహిళపై ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తన..

కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా వ్యవహరించిన ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

woman
ఎంఆర్ఐ సెంటర్‌కు రోగిని తరలిస్తుండగా బాధితురాలిపై అంబులెన్స్ అటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 27న ఈ ఘటన జరగ్గా మహిళ ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం గురువారం (మే 13) వైద్యులకు ఈ విషయం వెల్లడించారు.
 
వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు ప్రశాంత్ (33)ను అరెస్ట్ చేశారు. పెరింతలమన పట్టణంలో బాధిత మహిళ ఇటీవల ప్రైవేట్ దవాఖానలో కరోనా చికిత్స నిమిత్తం చేరారు. ఆమె పరిస్థితి విషమం కావడంతో ఏప్రిల్ 27న అంబులెన్స్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ల్యాబ్‌కు తరలించారు.
 
ఈ క్రమంలో అంబులెన్స్ వాహనంలో అటెండెంట్ ప్రశాంత్ ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఈ విషయం ఆమె వెల్లడించలేదు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.