శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2017 (12:42 IST)

కిలాడీ లేడీ.. ఐదు రోజుల ప్రేమ.. కోట్లు గుంజేసింది.. పోలీసుల గాలింపు

కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. మహీంద్రా షోరూములో చెల్లని చెక్కులిచ్చి కార్లు కొనుగోలు చేసింది. వరంగల్‌లో ఓ ప్రముఖుడి కుమారుడిని ఐదు రోజుల్లోనే ప్రేమ పేరిట ముగ్గులోక

కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. మహీంద్రా షోరూములో చెల్లని చెక్కులిచ్చి కార్లు కొనుగోలు చేసింది. వరంగల్‌లో ఓ ప్రముఖుడి కుమారుడిని ఐదు రోజుల్లోనే ప్రేమ పేరిట ముగ్గులోకి దింపి, పెళ్లి చేసుకుని ఉడాయించింది. 
 
ఈ కిలాడీ లేడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దర్యాప్తులో ఆ కిలాడీ లేడీ చెన్నైకి చెందిన ప్రియదర్శిని అలియాస్ స్నేహ అని పోలీసులు గుర్తించారు. ఆమె ఫోటోలను కూడా పోలీసులు విడుదల చేశారు. డబ్బున్న వ్యక్తుల పిల్లలను ఎంచుకుని, వారిని ముగ్గులోకి దించి సీక్రెట్ గా వివాహం చేసుకుని అందిన కాడికి దోచుకుంటుందని, చెన్నై నుంచి రూ. 3 వేలతో వరంగల్ వచ్చి, దాదాపు రూ. కోటికి పైగా మోసం చేసిందని పోలీసులు తెలిపారు.
 
ప్రస్తుతం ఆమె బెంగళూరుకు పారిపోయిందని.. స్నేహ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్నేహ మాయలో పడి వరంగల్ యువకుడు ఐదు రోజుల్లోనే ప్రేమలో పడి మోసపోయాడు. అలాగే ఓ డాక్టర్ వద్ద రూ.5లక్షలు గుంజేసింది. అతని స్నేహితులు ఇచ్చిన పది లక్షల రూపాయల చెక్కుల్ని దొంగతనం చేసింది. 
 
వరంగల్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా షోరూములో రూ. 75 లక్షలకు చెక్కులిచ్చి నాలుగు కార్లు కొనుగోలు చేసింది. ఆ చెక్కులు కాస్త బౌన్స్ అయ్యాయి. హైదరాబాదులోనూ ప్రియదర్శిని చేతిలో మోసపోయిన బాధితులు వున్నారు.