శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (20:29 IST)

మందుబాబులకు షాక్.. రోడ్ రోలర్‌తో తొక్కించేశారు..

కొత్త సంవత్సరం వేళ మందుబాబులకు షాక్ ఇచ్చారు కృష్ణా జిల్లా పోలీసులు. జిల్లా వ్యాప్తంగా సీజ్ చేసిన అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు.

రూ.50లక్షల విలువైన మద్యం సీసాలను రోడ్ రోలర్‌తో తొక్కించేశారు. దీంతో రోడ్డుపై మద్యం ఏరులైపారింది. 
 
రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. ప్రజలు తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.

దాంతో సరిహద్దుల వద్ద పోలీసులు నిఘా పెట్టి.. మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు రూ.50లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. అలాగే 119 వాహనాలను సీజ్ చేశారు.