శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (09:13 IST)

అడ్డగించి... యాసిడ్ పోస్తామని బెదిరించి మైనర్‌ను కాటేసిన కుర్రోళ్ళు.. ఎక్కడ?

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ దారుణం జరిగింది. ఓ ఇంట్లో పాచిపని చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్న ఓ బాలికపై ఆమె కంటే తక్కువ వయసున్న మైనర్ యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పని ముగించుకుని ఇంటికెళుతున్న బాలికను బలవంతంగా బైకు ఎక్కించుకుని తమ గదికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. తాము చేసిన పాడుపనిని వీడియో తీశారు. ఈ వ్యవహారం బయటకు చెబితే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ హెచ్చరించారు. గత ఆదివారం ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లుథియానాకు చెందిన 16 యేళ్ళ బాలిక స్థానికంగా ఉండే ఓ ఇంట్లో పాచిపని చేసుకుంటూ తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంది. ఆగ‌స్టు 30వ తేదీ ఆదివారం రాత్రి త‌న ప‌ని ముగించుకుని ఇంటికి ఒంటరిగా బయలుదేరింది. ఆ సమయంలో కొందరు టీనేజర్ కుర్రాళ్లు ఆమెను అడ్డ‌గించారు. వారిలో ఇద్ద‌రు త‌మ‌ బైక్‌పై ఎక్కాల‌ని ఆమెను బ‌ల‌వంతం చేశారు. 
 
ఆమె నిరాక‌రించ‌డంతో యాసిడ్ పోసి చంపేస్తామని బెదిరించారు. దీంతో భ‌‌య‌పడిన ఆమెను త‌మ బైక్‌పై ఎక్కించుకుని త‌మ రూమ్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ ఆమెపై సామూహికంగా బ‌లాత్కారం చేశారు. దాన్నంతా వారి ఫోన్ల‌లో రికార్డు చేశారు. ఎవ‌రైకా చెబితే చంపేస్తామ‌ని బెధిరించారు. దీంతో త‌నపై జ‌రిగిన దాడిని గురించి రెండు రోజుల వ‌ర‌కు ఎవ‌రి చెప్ప‌కుండా ఉండిపోయింది.
 
అయితే, మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న‌ను గురించి త‌న తల్లికి చెప్ప‌డంతో, వారు బుధ‌వారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నింధితుల‌పై పోలీసులు ఐపీసీ 376-డీ (గ్యాంగ్‌రేప్‌) సెక్ష‌న్‌తోపాటు, ఐటీ యాక్ట్ కింద కేసు న‌మోదుచేశారు. నిదింతులంతా 14 నుంచి 16 ఏండ్ల‌లోపువారేన‌ని పోలీసులు వెల్ల‌డించారు.