శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (07:58 IST)

ఏనుగు దాడిలో అటవీ అధికారి మృతి.. పులుల పోరు.. ఆరా తీసేందుకు వెళ్తే?

ఏనుగు దాడిలో ఓ అటవీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ (పీటీఆర్‌)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పన్నా పులుల అభయారణ్యంలో ట్రాకింగ్ ఆపరేషన్ కోసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆర్ కె భగత్ (52) అడవుల్లోకి వెళ్లారు.
 
అడవిలో రెండు పులుల పోరాటంలో ఓ పులి మరణించింది. దీనిపై ఆరా తీసేందుకు అడవికి వెళ్లిన భగత్‌ను రామ్ బహదూర్ అనే ఏనుగు తన దంతంతో పొడిచి చంపిందని అటవీశాఖ అధికారి కెఎస్ భడోరియా చెప్పారు. 
 
రేంజ్ ఆఫీసర్ భగత్ అడవిలో సంచరిస్తుండగా రామ్ బహదూర్ అనే ఏనుగు వారిపై ఒక్కసారిగా దాడి చేసిందని, భగత్‌ను తొండంతో బలంగా కొట్టి, తన దంతాలతో పొడిచి చంపిందని అటవీ అధికారి ఆర్కే గురుదేవ్ వెల్లడించారు. 
 
అయితే ఈ దాడికి కారణమేంటనే విషయం ఇంకా తెలియలేదని వెల్లడించారు. 20 ఏళ్ల క్రితం ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర అడవుల నుంచి 8 ఏనుగుల్లో రామ్ బహదూర్ ఏనుగు ఒకటి. ఏనుగు దాడిలో అటవీశాఖ అధికారి మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.