1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:15 IST)

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఒకే రోజు 676 మంది మృతి

మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 67,160 కరోనా కేసులు, 676 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,28,836కు, మొత్తం మరణాల సంఖ్య 63,928కు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో 63,818 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 34,68,610కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,94,480 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతున్నది. 
 
ఇక దేశంలో కరోనా సెకండ్​వేవ్​ విజృంభిస్తోంది. ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజుల నుంచి రోజుకు లక్షకు మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు కఠినమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక, ఇతర దేశాలతో పోలిస్తే భారత్​లో కరోనా ఉతృతి వేగంగా పెరుగుతుండటంతో పలు దేశాలు భారత్​కు విమాన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి