1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 జులై 2023 (09:02 IST)

శ్మశానంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ప్రేమజంట

love birds marriage
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌ జిల్లాల రహతా గ్రామంలో ఓ ప్రేమ జంట అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకుంది. అయితే, ఈ పెళ్లి కళ్యాణ మండపం లేదా దేవస్థానంలో జరుపుకోలేదు. ఓ శ్మశానవాటికలో జరుపుకుంది. దీనికి కారణం లేకపోలేదు. వధువు తండ్రి ఓ శ్మాశానవాటికలో ఓ కాపరిగా పని చేయడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రహతా గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే శ్మశానవాటికలో కాటికాపరిగా పని చేస్తున్నాడు. ఆయనది మహాసంజోగి సామాజిక వర్గం కూడా. కొన్నేళ్లుగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానంలోనే ఉంటున్నారు. గంగాధర్ కుమార్తె మయూరీ శ్మశానంలోనే పుట్టి, పెరిగింది. 12వ తరగతి వరకు చదువుకుంది. 
 
అయితే, ఆమె షిర్డీకి చెందిన మనోజ్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం ఇరుకుటుంబాల పెద్దలకు తెలియడంతో వారంతా కలిసి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, మయూరీ పుట్టి పెరిగిన చోటే ఆమె పెళ్లి చేస్తానని గంగాధర్ కోరడంతో ఆ జంట వివాహం శ్మశానంలో బంధువులు స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.