శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (16:31 IST)

మహారాష్ట్రలో కొత్త పార్టీ పెట్టిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు

eknath sinde
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన శివసేన పార్టీకి చెందిన రెబెల్ శాసనసభ్యులు కొత్త పార్టీని పెట్టారు. శివసేన బాలాసాహెబ్ అనే పేరుతో వీరు పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కారు వెల్లడించారు. 
 
ప్రస్తుతం తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో ఈ రెబల్ ఎమ్మెల్యేలంతా అస్సాం రాజధాని గౌహతిలో ఓ నక్షత్ర హోటల్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో వారు శివసేన బాలాసాహెబ్ పేరుతో ఈ పార్టీని స్థాపించారు. 
 
దీనిపై దీపక్ కేసర్కార్ మాట్లాడుతూ, రెబెల్ ఎమ్మెల్యేలంతా కలిసి శివసేన బాలాసాహెబ్ అని పేరు పెట్టామని, ఇక నుంచి తమ గ్రూపును ఇదే పేరుతో పిలవాలని ఆయన కోరారు. పైగా, తాము ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.