ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (15:47 IST)

గాంధీ విగ్రహం ఎదుట మమతా బెనర్జీ ధర్నా

ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నా చేపట్టారు. స్థానిక గాంధీ విగ్రహం దగ్గర మంగళవారం మధ్యాహ్నం నిరసనకు దిగారు. ఏప్రిల్‌ 12న రాత్రి 8 గంటల నుండి ఏప్రిల్‌ 13న రాత్రి 8 గంటల వరకు 24 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలంటూ ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే.

ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఒకరోజు పాటు ప్రచారంలో పాల్గనరాదని ఎలక్షన్‌ కమిషన్‌ నిషేధం విధించింది.

ముస్లింలు తృణమూల్‌ అభ్యర్థులకే ఓటేయాలని పిలుపివ్వడం, కేంద్ర బలగాలను అడ్డుకోవాలని ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని బిజెపి ఫిర్యాదు చేసింది. వీటిపై సమాధానమివ్వాలంటూ ఇసి గతవారం రెండు నోటీసులిచ్చింది.