సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:16 IST)

మన్మోహన్ సింగ్‌కు కరోనా.. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే?

దేశ మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్‌ సింగ్‌కు కూడా కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే, మన్మోహన్ సింగ్ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఓ ప్రకటన చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని.. జ్వరం కూడా తగ్గిపోయిందని తెలిపారు. 
 
స్వల్పంగా జ్వరం రావడంతో ఈ నెల 19న మన్మోహన్ సింగ్‌.. ప్రీమియర్ ఆస్పత్రిలో చేరారని.. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలిందని.. దాంతో మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరానని తెలిపారు సుర్జేవాలా.
 
ఇక, 88 ఏళ్ల మన్మోహన్ సింగ్... ఇప్పటికే రెండు కోవిడ్ టీకాలు కూడా తీసుకున్నారు.. మరోవైపు.. డాక్టర్ మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలంటూ.. ప్రార్థనలు చేసిన కాంగ్రెస్ శ్రేణులకు, తోటి భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు.
 
కాగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో.. భారత్ ప్రపంచ రికార్డే సృష్టిస్తోంది. సామాన్యులతో పాటు.. వీవీఐపీలు సైతం పెద్ద సంఖ్యలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.