1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (19:26 IST)

మేఘాలయ ఎమ్మెల్యే ఆస్తులు 5174 శాతం పెరిగాయి

ప్రజా ప్రతినిధులు ఏ విధంగా అవినీతికి పాల్పడుతారో మరోమారు నిరూపితమైంది. దీనికి మేఘాలయకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆస్తులే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ విషయం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చ

ప్రజా ప్రతినిధులు ఏ విధంగా అవినీతికి పాల్పడుతారో మరోమారు నిరూపితమైంది. దీనికి మేఘాలయకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆస్తులే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ విషయం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఎన్నికల్లో డియోస్టర్నెస్ జిండియాంగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన 2013 శాసనసభ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్‌లో తెలిపిన ఆస్తుల కన్నా ఈ ఏడాది చూపించిన ఆస్తులు భారీగా పెరిగాయి. 
 
ఈయన హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (హెచ్ఎస్‌పీడీపీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2013లో ఈయన తనకు రూ.40 వేల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.21 లక్షలని పేర్కొన్నారు.
 
స్వతంత్ర ఎమ్మెల్యే మైఖేల్ టి సంగ్మా ఆస్తులు కూడా ఐదేళ్ళలో 1,160 శాతం పెరిగాయి.2013లో ఆయనకు రూ.6 లక్షలు, 2018లో రూ.81 లక్షలు ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లు పేర్కొంటున్నాయి. అంటే ఈ ఎమ్మెల్యే ఆస్తులు 5174 శాతం పెరిగాయి.