గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (17:14 IST)

కర్ణాటక ఎన్నికలు.. గాలి కుటుంబానికి చుక్కెదురు.. ఆయనొక్కడే విన్

gali janardhan reddy
మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కలు కనిపించాయి. ఈ ఎన్నికల్లో గాలి కుటుంబం ప్రాభవాన్ని కోల్పోయింది. కుటుంబం నుంచి నలుగురు పోటీ చేస్తే కేవలం గాలి జనార్దన్ రెడ్డి మాత్రమే గెలుపొందారు. 
 
కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ తరపున పోటీ చేసిన గాలి.. గంగావతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ పార్టీ తరపున 15మంది బరిలోకి దిగారు. 
 
బళ్లారి పట్టణ నియోజకర్గం నుంచి బరిలోకి దిగిన జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మి ఓటమిపాలయ్యారు. గాలి కుటుంబానికి కంచుకోటగా ఉన్న బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి గెలుపొందారు.