గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (11:59 IST)

మైనర్ బాలికపై పెంపుడు తండ్రి అత్యాచారం.. గర్భవతి కావడంతో..?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మైనర్ బాలికను పెంపుడు తండ్రి గర్భవతిని చేసిన ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్‌లో బాలికపై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు.  వివరాల్లోకి వెళితే.. మల్లంపేటలో ఓ జంట పదేళ్ళుగా సహజీవనం చేస్తోంది.
 
ఆ మహిళ కుమార్తె(12)ను సైతం లోబర్చుకొని పదే పదే బాలికపై మారు తండ్రి రాకేష్(35) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు తెలియకూడదని..  మల్లంపేట్ లోని ఓ మెడికల్ షాప్ నిర్వాహకురాలి రిఫరెన్స్‌తో నిజాంపేట్‌లోని ఓ ఆర్ఎంపి వద్ద బాలికకు అబార్షన్ చేయించాడు. 
 
అయితే బాలిక ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో బోల్లారంలో మరో ఆర్ఎంపి సంప్రదించాడు. ఆర్ఎంపి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.