సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (11:37 IST)

ఒరిస్సా రాష్ట్రంలో అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పద మృతి

sasmitha minj
ఒరిస్సా రాష్ట్రంలో ఓ అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. రాష్ట్రంలోని రూర్కెలాలో అసిస్టెంట్ కలెక్టరుగా పని చేస్తున్న సస్మిత మింజ్ (35) ఈ నెల 15వ తేదీన విధులకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే, ఈ నెల 17వ తేదీన ఆమె ఓ హోటల్‌లో ఉన్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. అక్కడకు వెళ్లిన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆమె నిరాకరించారు. పిమ్మట రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహం ఓ జలాశయం వద్ద లభించింది. 
 
తనకు విశ్రాంతి కావాలని చెప్పి ఆమె వారిని కలిసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె మృతదేహం పట్టణంలోని జలాశయంలో కనిపించింది. తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్, చెప్పులను గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏకంగా ఓ అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.