గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (14:50 IST)

అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణా వాసుల మృతి

car accident
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణా వాసులు మృత్యువాతపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వీరంతా ప్రమాద సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
వేగంగా వెళుతున్న కారు ఒకటి అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న ఎనిమిది మంది పర్యాటకుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు. పర్యాటక అందాలను తిలకించేందుకు వచ్చి వారు దుర్మరణం పాలయ్యారు. వీరిని ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలవారిగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. 
 
ఈ ప్రమాదం అమరావతి జిల్లాలోని చికల్దారా సమీపంలో జరిగింది. కారులో ఉన్న నలుగురు చనిపోగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మహారాష్ట్ర పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు ఏపీ 28 డిడబ్ల్యూ 2119గా వుంది.