సామాజిక కార్యకర్త సింధుతాయ్ సప్కల్ కన్నుమూత
ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతాయ్ సప్కల్ ప్రాణాలు విడిచారు. 'వేల మంది అనాథలకు తల్లి' అని పిలువబడే ఆమె గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరణించేనాటికి ఆమె వయస్సు 73. దాదాపు ఒక నెలపాటు చికిత్స పొందుతున్న ఆమె గెలాక్సీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
సింధుతాయ్ అంత్యక్రియలు బుధవారం ఉదయం పూణే శివార్లలోని హదప్సర్ సమీపంలోని మంజరిలో జరుగుతాయని తెలిపారు. ఆమె నిస్వార్థ సేవలకు నవంబర్ 2021లో ఆమెకు పద్మశ్రీ అవార్డు లభించింది.
మహారాష్ట్రలోని వార్ధాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన సింధుతాయ్ మరణం పట్ల ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సింధుతాయ్ మరణంపై ప్రముఖులు ఆమె కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.