మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (13:57 IST)

అప్పుడే పుట్టిన పసికందు.. ముళ్ల పొదల్లో విసిరేశారు..

తమిళనాడు తిరువళ్లూరు జిల్లాకు సమీపంలోని పల్లిపట్టులో ఘోరం జరిగింది. అప్పుడే పుట్టి గంటలే గడిచిన మగశిశువును ముళ్ల పొదట్లో పడేశారు. స్థానికులు ఆ శిశువును గుర్తించి ఆస్పత్రికి తరించారు. వివరాల్లోకి వెళితే.. పల్లిపట్టుకు సమీపంలోని ఓ ముళ్ల పొదలో శిశువు ఏడుపు శబ్ధం విని స్థానికులు.. ఆ శిశువును వెతకడం ప్రారంభించారు. చివరికి ఆ శిశువును గుర్తించారు. 
 
ఆ శిశువు పుట్టి కొన్ని గంటలే అయి వుంటుందని.. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ శిశువును పరిశోధించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా వున్నట్లు తెలిపారు. ఆపై శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువును అలా ముళ్ల పొదల్లో పారేసిన వారెవరోనని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.