శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

నిజాం సొమ్ము మనదే

పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా భారత్‌కు మరో భారీ విజయం దక్కింది. హైదరాబాద్‌ నిజాం సంపదపై హక్కుల విషయమై భారత్‌-పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఈ కేసులో బ్రిటన్‌ హైకోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

1948లో హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కావడానికి కొద్ది రోజుల ముందు నిజాం ఆర్థిక మంత్రి బ్రిటన్‌లోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌ రహ్మతుల్లాకు 10 లక్షల పౌండ్లను పంపి జాగ్రత్తగా దాచాలని చెప్పారు. నిజాం చివరకు హైదరాబాద్‌ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేశారు. ఆ సొమ్ము ఎవరిదో న్యాయపరంగా తేలేవరకు ఖాతాను స్తంభింపజేస్తున్నట్లు అప్పట్లో స్థానికన్యాయస్థానం ప్రకటించింది.

నాటి 10 లక్షల పౌండ్లు వడ్డీతో కలిపి రూ.307 కోట్లయింది. నాట్‌వెస్ట్‌ బ్యాంకులో ఉన్న ఈ సొమ్ము తమదేనని పాకిస్థాన్‌ వాదిస్తుండగా, అది తమదేనని నిజాం వారసులు భారత్‌తో కలిసి న్యాయ పోరాటం చేస్తున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో బుధవారం బ్రిటన్‌ హైకోర్టు భారత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.