గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (13:38 IST)

పతాంజలి మెయిన్ క్యాంపస్‌లో నో కరోనా: రామ్ దేవ్ క్లారిటీ

పతంజలి మెయిన్ క్యాంపస్‌లో 83మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై యోగా గురు రామ్ దేవ్ స్పందించారు. ఆచార్యకులం నుంచి వచ్చిన కొత్త పేషెంట్లలో 14మంది విజిటర్లకు కొవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా వచ్చిందని యోగా గురు రామ్ దేవ్ స్పష్టం చేశారు.

కొన్ని మీడియాల్లో వస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పతాంజలి యోగ్ పీఠ్ మెయిన్ క్యాంపస్‌లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా లేదని చెప్పేశారు. ఆచార్యకులం నుంచి వచ్చిన కొత్త పేషెంట్లలో 14మంది విజిటర్లకు కొవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా వచ్చింది. వారినెవ్వరినీ మెయిన్ క్యాంపస్‌లోకి అనుమతించలేదని అన్నారు.
 
పతాంజలిలో ఒక్కరు కూడా కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు గురి కాలేదు. ఆచార్యకులం నుంచి అడ్మిషన్ కోసం వచ్చిన కొత్త స్టూడెంట్లను ప్రొటోకాల్ ప్రకారం.. టెస్టు చేయించాం. పాజిటివ్ గా వచ్చిన 14మంది విజిటర్లను లోపలికి అనుమతించలేదు. ఈ రిపోర్టులను పక్కకుబెట్టి రూమర్లు, అబద్ధాలే ప్రచారం జరుగుతున్నాయి. నేను ప్రతి రోజూ యోగా, హెల్త్ గురించి లైవ్ ప్రోగ్రాంలు చేస్తున్నా అని ట్వీట్లలో వెల్లడించారు.