గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జులై 2023 (19:38 IST)

బంట్రోతు కాళ్ళు మొక్కిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా?

dodde anjeneyulu
ఆయన ఓ జిల్లా కలెక్టర్. కానీ, ఆయన హోదాను పక్కనబెట్టి తన వద్ద పనిచేసే బంట్రోతు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన పేరు దొడ్డే ఆంజనేయులు. ఈయన తెలుగు అధికారి కావడం గమనార్హం. ఓ జిల్లా కలెక్టర్ బంట్రోతు కాళ్లు మొక్కడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ కథనం చదవండి.
జార్ఖండ్ రాష్ట్రంలోని పలామూ జిల్లా కలెక్టరుగా దొడ్డే ఆంజనేయులు పని చేస్తూ, ఆయన్ను దమ్కా జిల్లాకు బదిలీ చేశారు. తన స్థానంలో పలామూ జిల్లా కలెక్టరుగా శశిరంజన్ నియమితులయ్యారు. ఆయనకు శుక్రవారం బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో ముగ్గురు బంట్రోతులు పని చేస్తున్నారు. 
 
వారిని ఘనంగా సన్మానించిన కలెక్టర్ ఆంజనేయులు.. నందలాల్‌కు ఉన్నట్టుండి పాదాభివందనం చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ, నందలాల్‌లో తన తండ్రిని చూసుకున్నానని, అందుకే అలా చేసినట్టు చెప్పారు. పైగా, హోదాలతో కాదు.. మన ప్రవర్తనలతో వ్యక్తిత్వం ఇనుమడిస్తుందని ప్రత్యక్షంగా ఆయన చాటిచెప్పారు.