శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (15:42 IST)

నమ్మి హోటల్‌కు వెళ్లిన యువతి... సామూహిక అఘాయిత్యం

తన స్నేహితుల మాటలు నమ్మి హోటల్‌కు వెళ్లిన ఓ మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని పాటలీపుత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికకు సోషల్ మీడియా ద్వారా పర్వేజ్, రంజాన్ అనే ఇద్దరు యువకులు పరిచయమయ్యారు. ఆ ఇద్దరితో సదరు బాలిక తరచుగా ఛాటింగ్ చేసేది. 
 
కొద్ది రోజులకు ఫోన్ ద్వారా మాటలు కలిపింది. ముగ్గురూ తరచుగా మొబైల్ ద్వారా మాట్లాడుకునేవారు. గురువారం వారిద్దరూ ఓయో ద్వారా పాట్నాలో హోటల్ రూమ్ బుక్ చేసి సదరు బాలికను అక్కడకు రమ్మన్నారు. సరదాగా మాట్లాడుకుందామని పిలిచారు. 
 
వారి మాటలు నమ్మి అక్కడకు వెళ్లిన ఆ బాలికపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 
 
ఇద్దరు నిందితులపై కూడా పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే, ఈ విషయం తెలిసిన బాధితురాలి తల్లిదండ్రులు.. బాలికను తీవ్రంగా కొట్టి గాయపచరిచారు. వారికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.