ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (17:14 IST)

12వ విడత పీఎం కిసాన్ యోజన నగదు.. ఈ వారంలో విడుదల అవుతుందా?

Farmers
12వ విడత  పీఎం కిసాన్ యోజన నగదు.. ఈ వారంలో విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏడాదిలో రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటి వరకు రైతులకు 11వ విడత డబ్బులు అందుకున్నారు. ప్రస్తుతం 12వ విడత రానుంది. అయితే ఇప్పటి వరకు ఏ తేదీన రైతు ఖాతాల్లో జమ చేస్తారనే విషయం ఇంకా కేంద్రం అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ వారంలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
 
వాస్తవానికి, రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి వుంటుంది.  
 
ఈ పథకం కోసం ఇంకా దరఖాస్తు చేసుకోనట్లయితే, అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా సదరు రైతు పేరును నమోదు చేయడం ద్వారా పీఎం కిసాన్‌ ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే ఈ పథకం లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణించినా, ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు. లబ్ధిదారుడు మరణిస్తే సాగు భూమిని కలిగి ఉన్న రైతు వారసులు ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు. ఈ స్కీమ్‌ ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకోవచ్చు.