బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (10:45 IST)

చిరుతతో కర్రతోనే 15 నిమిషాలు ఫైట్.. తల్లిని ఎలా కాపాడుకుందంటే?

మహారాష్ట్రలో చిరుత బారి నుంచి ఓ యువతి తన తల్లిని కాపాడుకుంది. చిరుత పైపైకి వస్తున్నా కర్రతో 15 నిమిషాల పాటు పోరాడి.. దానిని తరిమికొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారా

మహారాష్ట్రలో చిరుత బారి నుంచి ఓ యువతి తన తల్లిని కాపాడుకుంది. చిరుత పైపైకి వస్తున్నా కర్రతో 15 నిమిషాల పాటు పోరాడి.. దానిని తరిమికొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సాకోలి తాలుకా పరిధిలోని ఉస్ గావ్‌లో జీజాబాయి మేకలు పెంచుకుంటోంది. ఈమెకు 24 ఏళ్ల రూపాలీ అనే కుమార్తె వుంది. 
 
మార్చి 24న రాత్రి మేకలను కట్టేసిన ప్రాంతంలో అలజడి రేగడంతో జీజాబాయి.. కుమార్తెతో కలిసి బయటకు వచ్చింది. ఆ సమయంలో రక్తపుమడుగులో మేక పిల్లలు పడి ఉండగా, చిరుతపులి వాటిని తింటూ కంటబడింది. జీజాబాయిని, రూపాలీని చూసిన చిరుత వారిపై దాడికి దిగింది. అయితే రూపాలి ఎదురుతిరిగింది. 
 
చేతిలో వున్న కర్రతో చిరుతపై ఎదురుదాడికి దిగింది. తల్లిని వెనక్కి తోసుకుంటూ చిరుతతో దాదాపు 15 నిమిషాల పాటు పోరాటం చేసింది. ఆపై నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లిన తల్లీ కుమార్తెలు తలుపులేసుకుని గడియపెట్టేసుకోవడంతో చిరుత వెనుదిరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రూపాలీని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల చికిత్సకు అనంతరం రూపాలీ మంగళవారం డిశ్చార్జ్ అయ్యింది.