సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (09:30 IST)

రాంబన్ జిల్లాలో సొరంగం కూలి ఏడుగురి గల్లంతు

tunnel
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని రాంబన్ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగ మార్గం కూలి ఏడుగురు ఆచూకీ కనిపించలేదు. వీరంతా శిథిలాల కింద చనిపోయివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, గల్లంతైన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
కాగా, రాంబన్ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్మూ శ్రీనగర్ హైవేపై ఈ సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో కొంతభాగం గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూలిపోయింది. దీంతో ఏడుగురి ఆచూకీ లభించకుండా పోయింది. దీంతో వారిని రక్షించడానికి స్థానిక పోలీసులు, సైనికులు సహాయక చర్యలు ప్రారంభించారు. 
 
అయితే, ఇప్పటివరకు సొంరంగం మార్గం నుంచి ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు రాంబన్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇంకా ఆరుగురిని రక్షించడానికి ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.