బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (16:59 IST)

ప్రధాని మోడీకి పాలనపై మంచి పట్టు - కాక రేపుతున్న పవార్ వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఇపుడుకాక రేపుతున్నాయి. ప్రధాని మోడీకి పాలనపై మంచి పట్టుందని, ఇదే ఆయన బలం అంటూ వ్యాఖ్యానించారు. పైగా, ఇప్పటికే వరకు దేశ ప్రధానులుగా పనిచేసిన వారిలో ఇది కనిపించలేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇపుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "ప్రధాని మోడీ ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు మోడీ విడిచిపెట్టరు. ఈ తరహా విధానం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల్లో కనిపించదు" అని వ్యాఖ్యానించారు 
 
మహారాష్ట్రలో బీజేపీని తప్పించి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ, ఆ ప్రభుత్వ పాలన సాఫీగా సాగిపోయేందుకు తనవంతు సహకారం అందిస్తున్న శరద్ పవార్‌ ఇపుడు ప్రధాని మోడీ గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.