శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (13:03 IST)

పాకిస్థాన్ బిర్యానీ మసాలాను అమ్మిన పాపానికి?

మహారాష్ట్రలోని బిగ్ బజార్ సూపర్ మార్కెట్లో పాకిస్థాన్ బిర్యానీ మసాలా అమ్మడానికి వ్యతిరేకంగా శివసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, పాల్గర్ జిల్లాలోని బిగ్ బజార్ సూపర్ మార్కెట్లో.. పాకిస్థాన్‌లో తయారైన బిర్యానీ మసాలాను కూడా అమ్మబడుతోంది. ఈ సూపర్ మార్కెట్‌కు భారీ ఎత్తున వినియోగదారులు వచ్చి వెళ్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బిర్యానీ మసాలాను మహారాష్ట్రలో అమ్మడం ఏమిటని శివసేన కార్యకర్తలు సూపర్ మార్కెట్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో షాపు ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపై సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టారు. ముందుగా ఆందోళనకారులతో షాపు మేనేజర్ మాట్లాడారు. అయినా మేనేజర్‌తో చర్చలకు శివసేన కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.