శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (16:00 IST)

అసలే ఎండలు: ఏసీ నుంచి తొంగి చూసిన నాగుపాము

అసలే వేసవి కాలం. మండే ఎండల తాపానికి తాళలేక ఏసీ ఆన్ చేస్తే నాగుపాము కనిపించింది. అంతే అందరూ జడుసుకుని పరుగులు తీశారు. ఈ ఘటన భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా, దూరదర్శన్ కేంద్ర ఎంస

అసలే వేసవి కాలం. మండే ఎండల తాపానికి తాళలేక ఏసీ ఆన్ చేస్తే నాగుపాము కనిపించింది. అంతే అందరూ జడుసుకుని పరుగులు తీశారు. ఈ ఘటన భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా, దూరదర్శన్ కేంద్ర ఎంసీఎల్ స్టాఫ్ కాలనీకి చెందిన డిస్పెన్సరీ ఏసీలోంచి నాగుపాము తొంగిచూసింది. 
 
ఏసీ ఆన్ చేస్తే పనిచేయలేదని తెలుసుకున్న డిస్పెన్సరీ సిబ్బంది.. ఏసీ మెకానిక్‌ను పిలిపించారు. అయితే ఏసీని రిపేర్ చేస్తుండగా.. ఏసీ మెకానిక్‌కు గుండే ఆగిపోయేంత పనైంది. ఎందుకంటే? ఏసీ స్టాండ్‌పై బుస్సలు కొడుతూ నాగుపాము కనిపించింది.
 
దీంతో జడుసుకున్న అందరూ ఆపై స్నేక్ హెల్ఫ్ లైన్‌కు కాల్ చేశారు. చివరికి అధికారులు ఏసీలోంచి పామును వెలికి తీశారు. దీంతో డిస్పెన్సరీలోని వారంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.