గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 మే 2021 (10:16 IST)

కొవిడ్ కేసుల్లో స్వల్ప తగ్గుదల

దేశంలో కరోనాఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మరోరోజు నాలుగు వేలకు పైనే మరణాలు నమోదయ్యాయి. రోజూవారీ కేసులు మాత్రం కొద్దిమేర తగ్గాయని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

శుక్రవారం 20,66,285మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,57,299మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. గత కొద్దిరోజులుగా కొత్తకేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.

అలాగే గత నాలుగు రోజులుగా నిత్యం 20లక్షలపైనే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ..మూడు లక్షలకు దిగువనే కేసులు వెలుగుచూస్తున్నాయి. అలాగే 24 గంటల వ్యవధిలో 4,194మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మరోసారి వరసగా రెండోరోజు కరోనా మరణాలు నాలుగువేలకు పైబడ్డాయి.
 
అత్యధికంగా మహారాష్ట్రలో 1,263, తమిళనాడులో 467మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కరోనా సోకిన వారిసంఖ్య 2,62,89,290 చేరింది. గత సంవత్సరకాలంలో మహమ్మారి 2,95,525మంది ఉసురుతీసింది. ఇక క్రియాశీల కేసులు 30లక్షల దిగువకు చేరాయి.

ప్రస్తుతం 29,23,400మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. నిన్న 3,57,630మంది కోలుకున్నారు. వరసగా 9వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి.

మొత్తం రికవరీలు 23కోట్ల మార్కును దాటాయి. క్రియాశీల, రికవరీ రేట్లు వరసగా..11.12 శాతం, 87.76 శాతంగా ఉన్నాయి. మరోవైపు నిన్న 14,58,895 మందికి టీకాలు డోసులు అందాయి..