శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 జులై 2022 (10:05 IST)

నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా గాంధీ

sonia gandhi
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె విచారణను ఎదుర్కోనున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ విచారణ చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని విచారించారు.
 
ఆ సమయంలో సోనియా గాంధీ కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరివున్నారు. ప్రస్తుతం ఆమె ఇంటికి రావడంతో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీచేసింది. దీంతో ఆమె గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకానున్నారు. 
 
మరోవైపు, సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఆందోళనల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టనున్నారు. 
 
మరోవైపు, కాంగ్రెస్ వర్గాల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ భారీగా పోలీసులు మొహరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డును ఇప్పటికే మూసివేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా భారీ సంఖ్యలో బారీకేడ్లు ఏర్పాటు చేశారు.