సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (17:46 IST)

మస్కిటో కాయిల్ ఫోటోను పోస్ట్ చేసిన ఉదయనిధి స్టాలిన్

mosquito repellent
mosquito repellent
సనాతన ధర్మంపై తమిళనాడుకు చెందిన నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనానికి దారి తీశాయి. 
 
ఈ నేపథ్యంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎక్స్ సైట్‌లో పోస్ట్ చేసిన ఫోటో చూసి నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. దోమలను తరిమే మస్కిటో కాయిల్ ఫోటోను పోస్ట్ చేశారు. ఫోటోకు క్యాప్షన్ లేకపోవడంతో నెటిజన్లు అయోమయంలో పడ్డారు.  
 
అయితే ఈ ఫొటో సనాతన ధర్మంపై గతంలో ఉదయనిధి చేసిన డెంగీ, మలేరియా వ్యాఖ్య‌లను గుర్తుకుతెస్తుంది. ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.