గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (12:44 IST)

కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నాను.. సుమలత అంబరీష్

తాను కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నానని సినీ నటి సుమలత అంబరీష్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఏమైనా జరుగవచ్చునని.. మండ్య లోక్‌సభ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు చివరిక్షణం వరకు వేచి చూస్తానని వెల్లడించారు. మండ్య ప్రాంత ప్రజలు తనను కోడలిలా చూస్తున్నారన్నారు. ఇప్పటివరకు రాజకీయ కోణంలో ఎవరినీ కలవలేదన్నారు. 
 
చాముండేశ్వరి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సుమలత మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీటు ఇస్తుందని వేచి చూస్తున్నానన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను పెద్దగా పట్టించుకోనని చెప్పారు. 
 
అయితే మంత్రి రేవణ్ణ భర్త మృతి చెంది ఒక నెల కాలేదు.. అప్పుడే సుమలతకు రాజకీయాలు కావాలా.. అనే వ్యాఖ్యలపై సుమలత తీవ్రంగా స్పందించారు. ఓ తల్లిగా తాను ఇతరులను బాధపెట్టే వ్యాఖ్యలు చేయనని.. తన నుంచి, తన ఆరోపణల ద్వారా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సుమలత అన్నారు. 
 
అతిథులను ఎలా గౌరవించాలో, ఎలా సత్కరించాలో అంబరీశ్‌ కుటుంబానికి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, అంతటి దుస్థితి మాకు పట్టలేదు అని మంత్రి తమ్మణ్ణ చేసిన వ్యాఖ్యలకు సుమలత కౌంటర్‌ ఇచ్చారు.