సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మే 2023 (13:15 IST)

పేరుకు ముందు కుమారి, శ్రీమతి వంటి పదాలు పెట్టుకోవద్దు...

supreme court
పెళ్లికాని యువతుల పేర్లు ముందు కుమారి, పెళ్లయిన మహిళల పేర్ల ముందు శ్రీమతి వంటి పదాలను పెట్టుకుంటారు. అయితే, ఏ యువతి లేదా మహిళ తమ పేర్ల ముందు కుమారి, శ్రీమతి అనే పేర్లు పెట్టుకోకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది ప్రచారానికి దాఖలు చేసిన దావాలా కనిపిస్తోందని పేర్కొంది.
 
'మీరు మా నుంచి ఏ ఊరట కోరుకుంటున్నారు. ప్రచారానికి వేసినట్లు ఉంది. కుమారి, శ్రీమతి లాంటి పదాలను పేరుకు ముందు పెట్టుకోవాలని మహిళను అడగకూడదని మీరు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా వాడాలనుకుంటే.. వారినెలా నిరోధిస్తారు. ఇందుకొక సాధారణ పద్ధతి అంటూ లేదు. పేరుకు ముందు ఆ పదాలను వాడాలా లేదా అన్నది ఆ వ్యక్తి ఎంపికననుసరించి ఉంటుంది' అంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.