శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (11:03 IST)

నేషనల్ హెరాల్డ్ కేసు : షార్ట్ నోట్ సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశం!!

court
నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో లిఖితపూర్వక షార్ట్ నోట్ సమర్పించాలంటూ పేర్కొంటూ తదుపరి విచారణను అక్టోబరు నెల 29వ తేదీకి వాయిదావేసింది. ఈ మేరకు మాజీ ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆదేశించింది. వాదనలపై నాలుగు వారాల్లో లిఖితపూర్వక నోట్ దాఖలు చేయాలని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ వీరిని ఆదేశించారు. 
 
నేషనల్ హెరాల్డ్ కేసుపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. లఖిత పూర్వక నోట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసి, తదుపరి విచారణను అక్టోబరు 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులను ప్రాసిక్యూట్ చేయడానికి తనను అనుమతించాలని సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టు వేసింది. దీంతో 2021 ఫిబ్రవరి 11వ తేదీన ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సోనియా, రాహుల్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ జార్జ్ ఫెర్నాండెజ్ (దివంగత), సుమన్ దుబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.