ప్రియుడి మోజులో కాబోయే భర్తను హత్య చేసిన యువతి

murder
Last Updated: ఆదివారం, 16 జూన్ 2019 (14:21 IST)
ప్రియుడు మోజులో పడి కాబోయే భర్తను హత్యచేసిందో యువతి. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా రైల్వే కోడురు పట్టణంలో రంజాన్ పండుగ పర్వదినం రోజున జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, రైల్వే కోడూరుకు చెందిన అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తికి తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూండిలో ఉంటున్న మేనత్త కుమార్తె శబ్న అనే యువతితో వివాహం నిశ్చమైంది. అయితే, శబ్నకు నిశ్చితార్థానికి ముందే ప్రిన్స్ అనే యువకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.

ఈ క్రమంలో అబ్దుల్ ఖాదిర్‌ను పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని శబ్న... తన మనసులోని మాటను ప్రియుడు ప్రిన్స్‌కు చెప్పింది. ఇందుకోసం తన కాబోయే భర్తను చేయాలని ప్రియుడిని ఉసిగొల్పింది. ఇందుకోసం శబ్న స్వయంగా ఓ పథకం రచించగా, అందుకు ప్రియుడు కూడా సమ్మతించాడు.

తమ పథకంలో భాగంగా, ప్రిన్స్ తన స్నేహితులైన దీనదయాళ్, సెల్వం, లక్ష్మణ్, బ్రిస్టన్‌లతో కలిసి అబ్దుల్ ఖాదిర్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తన స్నేహితులకు ప్రిన్స్ కొంత డబ్బు కూడా ఇచ్చాడు. అయితే, అబ్దుల్ ఖాదిర్ ఒంటరిగా చిక్కక పోవడంతో అతన్ని హత్య చేయలేకపోయారు.

ఈ క్రమంలో రంజాన్ రోజన అబ్దుల్ రజాక్ తమ ఇంటికి వస్తున్నాడన్న సమాచారాన్ని ప్రియుడుకు శబ్న చేరవేసింది. అతను తన స్నేహితులను అప్రమత్తం చేయగా, వారు మాటువేసి అబ్దుల్ ఖాదిర్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు. దీనిపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రాథమిక విచారణ చేపట్టారు.

ఈ విచారణలో ప్రిన్స్‌తో పాటు శబ్నకు సంబంధం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు రావడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. ఆ తర్వాత హత్య చేసిన కిరాయి ముఠా సభ్యుల్లో ఇద్దరినీ అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కోసం కిరాయి ముఠా సభ్యులు ఉపయోగించిన వాహనం, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :