తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు.. స్కూల్స్ బంద్
రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.
దాంతో కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా స్కూళ్లు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు. ఇక చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, చుద్దలోర్ జిల్లాల్లో, పుదుచ్చేరిలో మంళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.