శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (19:27 IST)

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది.  రైలు హరియాణాలోని బల్లభ్‌గఢ్‌ వద్దకు రాగానే 9వ నంబరు కోచ్‌ కిందభాగంలో మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పాంట్రీ, ఎస్ 10, బి1 బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక బోగి పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది.

మంటలంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. ఘటన కారణంగా అదే మార్గంలో నడిచే మిగిలిన వ్యాగన్లను కూడా నిలిపివేశారు. పొగలు రావడానికి కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.