సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (15:49 IST)

అగ్రకులాల అహం తగ్గలేదు.. దళిత బాలుర్ని అలా చేయించారు..?

ఆధునికత పెరిగినా అగ్రకులాల వారి అహం మాత్రం తగ్గట్లేదు. అగ్రకులానికి చెందిన ముగ్గురు.. వారి మైదానంలో వున్న మలమూత్రాలను ఐదుగురు దళిత బాలురితో బలవంతంగా శుభ్రం చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్రకులానికి చెందిన ముగ్గురు యువకులను తమిళనాడులో అరెస్టు చేశారు. పెరంబలూర్ జిల్లాలోని సిరుకుదల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
వివరాల్లోకి వెళితే.. ఐదుగురు దళిత బాలురు ఓపెన్ గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారు. వారిని చూసిన నిందితులు గ్రౌండ్‌లో పడి ఉన్న మలమూత్రాలను క్లీన్ చేయాలని బలవంతం పెట్టారు. అగ్రకులానికి చెందిన వారంతా కలిసి వారికి ఆ బ్యాగులు మోసుకెళ్లమని పురమాయించారు. 
 
ఈ ఘటన తెలిశాక గ్రామంలో ఆందోళన వాతావరణం మొదలైంది. విడుదలై సిరుతైగల్ కచ్చి సభ్యులైన బాధిత పిల్లల కుటుంబాలు రోడ్ బ్లాక్ చేసి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. సీన్‌లోకి పోలీసులు ఎంటర్ అయ్యాక ఆందోళనను విరమించుకున్నారు. అగ్ర కులాల యువకులను అరెస్ట్ చేశారు.