బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (21:47 IST)

ముంబై నగరంలో విడాకులకు ట్రాఫికే కారణం.. చెప్పింది ఎవరంటే?

Amruta Fadnavis
నగరంలో మూడు శాతం విడాకులకు ముంబై ట్రాఫిక్ కారణమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ తెలిపారు. ఆర్థిక రాజధానిలో రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితిపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ విచిత్రమైన వాదనను వినిపించారు. 
 
ఇకపోతే.. శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది, శ్రీమతి ఫడ్నవీస్‌ను పేరు పెట్టకుండా, ఆమె ప్రకటనపై ధ్వజమెత్తారు. ఇదే "ది బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే" అని పేర్కొన్నారు. 
 
ముంబైలో మూడు శాతం విడాకులకు ప్రజలు తమ కుటుంబాలకు సమయం కేటాయించలేకపోవడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయని మీకు తెలుసా?" అంటూ అమృత ఫడ్నవిస్ చెప్పారు.  
 
రోడ్లపై గుంతలు, ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డానని శ్రీమతి ఫడ్నవీస్ అన్నారు. "నేను దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అనే విషయం మరచిపోండి. ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను. రోడ్లు, గుంతలలో ట్రాఫిక్ మరియు వారు మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో నేను కూడా అనుభవించాను" అని ఆమె అన్నారు.