ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 17 జులై 2021 (15:21 IST)

పారామిలటరీలో వీఆర్‌ఎస్‌లు అధికమే

దిల్లీ: కేంద్ర హోం శాఖ పరిధిలోని బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి ఆరు పారామిలటరీ దళాల్లో స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలు అధికంగానే ఉంటున్నాయి. ఇందుకుగల కారణాలపై ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేయించలేదు.

గత దశాబ్దం 2011-2020లో 81,007 మంది స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేశారు. 2017లో అత్యధికంగా 11,728 మంది వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఇదే సమయంలో 15,904 మంది రాజీనామా చేశారు. 2013లో వీరి సంఖ్య అధికంగా ఉంది. ఆ ఒక్క ఏడాదే 2,332 మంది ఉద్యోగాలను విడిచిపెట్టారు. వ్యక్తిగత, ఆరోగ్య కారణాలు, ఉన్నత ఉద్యోగాలు లభించడం వంటివి ఇందుకు కారణాలని అధికారులు విశ్లేషిస్తున్నారు.

బలగాల వారీగా పరిశీలిస్తే బీఎస్‌ఎఫ్‌ నుంచి రాజీనామాలు, వీఆర్‌ఎస్‌లు అధికంగా ఉంటున్నాయి. తరువాత స్థానంలో సీఆర్‌పీఎఫ్‌ ఉంది. ఈ రెంటింటితో పాటు సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌ను కూడా పారామిలటరీ దళాలుగా వ్యవహరిస్తుంటారు. వాటి బలగం దాదాపు పది లక్షల వరకు ఉంటుంది.