శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (15:08 IST)

ర్యాష్ డ్రైవింగ్‌.. అడ్డొచ్చిన వాడిని రెండు కిలోమీటర్లు లాక్కెళ్లాడు..

ర్యాష్ డ్రైవింగ్‌తో వాహనాన్ని గుద్దాడు. అడ్డొచ్చిన బాధితుడిని కారు బానెట్‌పై రెండు కిలోమీటర్లు లాక్కెళ్లాడు. ఢిల్లీలో కారు ప్రమాదం కలకలం రేపింది. వాహనాన్ని ఢీకొట్టిన కారు యజమాని, ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేసాడు. ఇంతలో బాధితుడు అడ్డంగా బానెట్‌పై కూర్చున్నాడు. అయినా కారును ఆపకుండా అలాగే ముందుకు తీసుకెళ్లాడు కారు యజమాని. 
 
బానెట్‌పైన కూర్చుని ఉన్న వ్యక్తి అలాగే 2 కిలోమీటర్ల వరకూ ఉండిపోయాడు. అయితే వాహనం మెల్లగా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఇంతలో పోలీసులు వచ్చి ర్యాష్ డ్రైవింగ్ కింద సదరు కారు యజమానిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఏదేమైనా బాధితుడు అలాంటి సాహసం చేసాడంటే అతడిని మెచ్చుకోవాల్సిందే కానీ అటు ఇటు అయితే అది కాస్త ప్రాణాలకు ముప్పే కదా మరి.