బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మే 2022 (22:34 IST)

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

 Baby
కర్ణాటకలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. భద్రావతి తాలుకాలోని తడసా గ్రామానికి చెందిన అల్మాజ్ భాను (22) అనే మహిళ శివమొగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం (మే 23) ప్రసవించింది.
 
ఒకే కాన్పులో ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు జన్మించారు. నలుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 
ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదని... 5.12 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా నలుగురు పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఆ ఆసుపత్రి వైద్యురాలు డా.చేతన పేర్కొన్నారు.