ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభం.. ఏ రోజు ఏ అవతారం దర్శనం...
విజయవాడ: అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ.. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున స్నపనాభిషేకంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. గణపతి పూజ అనంతరం
విజయవాడ: అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ.. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున స్నపనాభిషేకంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. గణపతి పూజ అనంతరం అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి... దసరా ప్రకటన చేశారు. నేటి నుంచి 11 రోజుల పాటు భక్తులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి అమ్మవారికి రోజుకో అలంకారం ఉంటుంది. తొలి రోజున అమ్మవారికి శనివారము-ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి- శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తోంది.
శ్రీ అమ్మవారి దివ్య అలంకారములు
2-10-2016-ఆదివారము-ఆశ్వయుజ శుద్ధ విదియ- శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
3-10-2016-సోమవారము-ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది)- శ్రీ గాయత్రి దేవి
4-10-2016-మంగళవారము-ఆశ్వయుజ శుద్ధ తదియ- శ్రీ అన్నపూర్ణా దేవి
5-10-2016-బుధవారము-ఆశ్వయుజ శుద్ధ చవితి- శ్రీ కాత్యాయని దేవి
6-10-2016-గురువారము-ఆశ్వయుజ శుద్ధ పంచమి- శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
7-10-2016-శుక్రవారము-ఆశ్వయుజ శుద్ధ షష్ఠి- శ్రీ మహాలక్ష్మిదేవి
8-10-2016-శనివారము-ఆశ్వయుజ శుద్ధ సప్తమి- శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
9-10-2016-ఆదివారము-ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) – శ్రీ దుర్గా దేవి
10-10-2016-సోమవారము- ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)- శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
11-10-2016-మంగళవారము-ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)- శ్రీ రాజరాజేశ్వరి దేవి.