శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (19:15 IST)

శరన్నవరాత్రులు స్పెషల్.. రవ్వతో కేసరి ఎలా చేయాలి..

శరన్నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారిని మహాలక్ష్మీగా అలంకరిస్తారు. నైవేద్యంగా కేసరి నివేదిస్తారు. ఆ రోజున రవ్వను నేతిలో దోరగా వేపి అమ్మవారికి కేసరిని తయారు చేసి సమర్పించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. అలాంటి రవ్వ కేసరిని ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
రవ్వ : పావు కేజీ.
పాలు : అర లీటరు
చక్కెర : పావు కేజీ
డ్రై ఫ్రూట్స్‌ : పావు కప్పు
నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్‌
గుమ్మడి గింజలు : ఒక టీస్పూన్‌
యాలకుల పొడి : పావు టీస్పూన్‌
 
తయారీ విధానం:
ముందుగా నెయ్యి వేసి ఓ కడాయిలో డ్రై ఫ్రూట్స్‌ను దోరగా వేపుకుని పక్కన బెట్టుకోవాలి. ఆపై రవ్వను దోరగా వేపుకోవాలి. ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేసుకోవాలి. దోరగా వేపిన రవ్వను మరుగుతున్న పాలల్లో పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పది నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ఇందులో చక్కెర, యాలకుల పొడి వేసి కలపాలి. మరో రెండు నిమిషాలు ఉంచి వేయించిన డ్రై ఫ్రూట్స్‌, గుమ్మడి గింజలు వేసి కలిపి దించేయాలి. అంతే రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయినట్లే.